పటాన్ చెరులో కోడి పందేలు, పరారీలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని

 


పటాన్‌చెరు, సామాజిక స్పందన:

పటాన్‌చెరు అర్బన్‌ పటాన్‌చెరు మండలం చినకంజర్ల శివారులో సర్వేనంబర్‌ 250లో మామిడితోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పటాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.ఘటనా స్థలంలో 70 మంది ఉన్నారు.ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అక్కినేని సతీష్‌, కృష్ణంరాజు, శ్రీనులు బృందంగా ఆడుతున్నారని ఆయన తెలిపారు. 21 మందిని పట్టుకున్నారు. రూ.13 లక్షలు, 26 వాహనాలు, 27 సెల్‌ఫోన్లు, 30 కోడి కత్తులు, 31 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. చింతమనేని ప్రభాకర్‌, కృష్ణంరాజులు పరారయ్యారని, అక్కినేని సతీష్‌, బర్ల శ్రీను పోలీసుల అదుపులో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.


@@@@@@@ మరిన్ని వార్తలు చదవండి @@@@@


హైదరాబాద్ లో నేటి నుంచి బోనాల పండుగ, గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారు బోనం

హైదరాబాద్, సామాజిక స్పందన:

నేడు గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలు ప్రారంభం కానుందని ప్రకటించారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఈ పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు.నేడు లంగర్హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం అలాగే తోటలను తీసుకువెళ్తారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటల వరకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకొనుంది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం తరఫున మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ చౌరస్తాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జులై 5 న అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు.ఈ సారి అమ్మవారి కల్యాణానికి 5 లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నామని.. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి KCR ఆధ్వర్యంలో అన్ని పండుగలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.